Saturday 3 December 2016

 పోషకాలూ ఉన్నాయ్!
వందగ్రా. ఉసిరిలో 80 శాతం నీరూ కొద్దిపాళ్లలో ప్రొటీన్లూ, పిండిపదార్థాలూ పీచూ లభిస్తాయి. 478మి.గ్రా. సి-విటమిన్ లభ్యమవుతుంది. ఎంబ్లికానిన్-ఎ, ఎంబ్లికానిన్-బి, ప్యునిగ్లుకానన్ వంటి పాలీఫినాల్సూ, ఎలాజిక్, గాలిక్ ఆమ్లం... వంటి ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం... వంటి ఖనిజాలూ ఉసిరిలో దొరుకుతాయి.
• ఆరోగ్యఫలం!
ఆయుర్వేదం ప్రకారం- ఉసిరి మూడు రకాల దోషాల్నీ తగ్గిస్తుంది. అన్ని అవయవాలూ సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఆయుర్వేదవైద్యంలో అద్భుత ఔషధంగా చెప్పే చ్యవన్‌ప్రాశ్‌లో ఉండే ప్రధాన పదార్థం ఉసిరే.
* ఉదయాన్నే ఖాళీకడుపుతో ఉసిరి పొడిని తీసుకోవడంవల్ల దీర్ఘకాలిక దగ్గు, అలర్జీ, ఆస్తమా, టీబీ వంటివన్నీ తగ్గుముఖం పడతాయి.
* వీర్యసమృద్ధికీ ఉసిరి ఎంతగానో తోడ్పడతుందట.
* తిన్నది వంటబట్టేలా చేయడంలో దీన్ని మించింది లేదు. ఎండు ఉసిరి జీర్ణసంబంధమైన అన్ని సమస్యల్నీ నివారిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. భోజనం తరవాత ఇది తింటే ఎంతో మేలు.
* వేసవిలో ఉసిరి తినడంవల్ల చలువ చేస్తుంది.
* కాలేయవ్యాధులకు ఉసిరి అద్భుతమైన మందు. శరీరంలోని విషతుల్యాలలను తొలగిస్తుంది.
* నాడుల్ని బలోపేతం చేయడం ద్వారా మెదడుపనితీరుని మెరుగుపరుస్తుంది. ఉసిరి తీసుకోవడంవల్ల జ్ఞాపకశక్తీ, తెలివితేటలూ పెరుగుతాయట.
* రుతుసమస్యల్ని తొలగించి సంతానోత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుతుంది.
* కఫదోషాల్ని నివారించడం ద్వారా వూపిరితిత్తుల సమస్యల్ని తగ్గిస్తుంది. ఉసిరి మలబద్ధకానికీ మంచి మందే.
* ఉసిరిముద్దని తలకి పట్టించి స్నానం చేస్తే కళ్లమంటలు తగ్గుతాయట.
* ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది.
* కేశసంరక్షణకు ఉసిరి ఎంతో మేలు. రోజూ తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జుని కుదుళ్లకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతోబాటు నల్లగా ఉంటాయి. దీంతో చేసే షాంపూలూ నూనెలూ జుట్టుకి ఎంతో మంచివి. ఇవి బాలమెరుపునీ చుండ్రునీ తగ్గిస్తాయి. ఉసిరి రోజూ తింటే కాల్షియం శోషణకు సహాయపడుతుంది. ఫలితంగా ఎముకలూ, దంతాలూ, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇందులోని విటమిన్-సి శరీరాన్ని ఎండవేడిమి నుంచీ చర్మరోగాల నుంచీ కాపాడటంతోబాటు చర్మాన్ని కాంతిమంతంగా చేస్తుంది.

No comments:

Post a Comment