Saturday 3 December 2016

బత్తాయి జ్యూస్ లోని ఆరోగ్య ప్రయోజనాలు ........
అత్యంత ఆరోగ్యప్రయోజనాలను అంధించే పండ్లలో బత్తాయి కూడా ఒటి. దీన్ని(మోసంబీ) స్వీటీ లైమ్ అంటారు
బత్తాయి రసంలో డయాబెటిక్ పేషంట్స్ కు చాలా ప్రయోజనకారి. రెండు చెంచాలా బత్తాయి రసంలో, 4చెంచాలా ఉసిరి రసాన్ని, ఒక చెంచా తేనె మిక్స్ చేసి, ప్రతి రోజూ కాలీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
గర్భిణీకి మంచి ప్రయోజకారిని: గర్భిణీ స్త్రీలు తరచూ బత్తాయి రసాన్ని త్రాగమని సలహాలిస్లుంటారు. ఇందులో ఉండే క్యాల్షియం, కడుపులో పెరిగే బిడ్డకు మరియు తల్లికి ఇద్దరికి అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంది.
బత్తాయి జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో గుండె ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది. యాధి నిరోధక శక్తిని పెంపొందించటమే గాకుండా.. ఒంట్లోని వేడిని బత్తాయి రసం తగ్గిస్తుంది. మూత్రనాళంలో మంటతో బాధపడేవారు బత్తాయి రసంలో గ్లూకోజ్ లేదా పంచదార కలుపుకుని తీసుకున్నట్లయితే మంట తగ్గటమేగాకుండా, మూత్రం సాఫీగా వస్తుంది. 
పెప్టిక్ అల్సర్ అన్నవాహిక, ఉదరం లేదా ఎగువ పేగులోపలి పొర ఇన్ఫెక్షన్ సంభవిస్తే కడుపు నొప్పికు దారితీస్తుంది. కాబట్టి, ఈ స్వీట్ లైమ్ జ్యూస్ లో యాసిడ్ గ్యాస్ట్రిక్ ఎసిడిటిని తగ్గిస్తుంది. మంచి ఫలితం కోసం బత్తాయి రసాన్ని త్రాగాలి. మోసంబీ జ్యూస్ ను గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి త్రాగడం వల్ల మౌత్ అల్సర్ మరియు చెడు శ్వాస నివారించబడుతుంది.
విటమిన్ సి లోపం వల్ల ఏర్పడే వ్యాధులను నివారిస్తుంది మరియు ఇది దంతచిగుళ్ళ వాపుల తగ్గిస్తుంది. ఆంకా దగ్గు, జలుబు మరియు పెదాల పగుళ్ళను నివారిస్తుంది. కాబట్టి, మోసంబీరసంలో ఉండే విటమిన్ సి ఇన్ని రకాలుగా సహాయపడుతుంది.

No comments:

Post a Comment