Friday, 2 December 2016

వచ్చే తుమ్మును ఆపాలని ట్రై చేస్తే…..మైండ్ లోని రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదముంది.!

తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంది అనే సామెత మనం వినే ఉంటాం .అలాగే ఎక్కువ శాతం మంది తుమ్ముని అపశకునంగా భావిస్తారు.ఎక్కడికైనా బయల్దేరినప్పుడు తుమ్ము వస్తే ఆగిపోవడం,ఏదైనా పని ప్రారంభించే ముందు తుమ్మినా పనిని ఆపు చేయడం చేస్తుంటారు.తుమ్ము అనేది మనిషి శరీరంలో జరిగే సహజక్రియ.నిజానికి తుమ్ము రాని మనిషంటూ ఉండడు. ముక్కులో వున్న సన్నటి పొర మ్యూకస్ మెంటబస్ కి నొప్పి కలిగితే మనకు తుమ్ములొస్తాయి.జలుబు,అలర్జీ వలన తుమ్మొస్తుంది.తుమ్మే కదా అని లైట్ తీస్కోకకండి…తుమ్ముడం మన ఆరోగ్యానికి మంచిది .తుమ్ముకి సంభందించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
t-1


తుమ్ముకి వేగం ఎక్కువ అని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి.తుమ్ము కిలో మీటర్ కు 100 మైల్స్ వరకు ప్రయాణిస్తుంది.
కళ్లు మూయకుండ తుమ్మడం అనేది అసాధ్యం. దయచేసి ట్రై చేయకండి.
తుమ్మినపుడు బైటికొచ్చే క్రిములు 5 నుండి 20 అడుగుల వరకు విస్తరించగలవు. కావున, మీ చుట్టూ ఉండే వారిలో ఎవరైన తుమ్మినట్లయితే ఆ క్రిములు మీపై పడకుండా ఉండాలంటే మీరు 20 మీట్లర్ల దూరం జరగడం మంచిది.
కొంతమందికి జలుబువల్ల తుమ్ములొస్తాయి.మరికొందరికి సాధారణంగా తుమ్ములొస్తుంటాయి.సూర్యకాంతి వల్ల కూడా కొందరికి తుమ్ములొస్తాయి .అలాంటి తుమ్ములను ఫోటిక్ స్నీజ్ అంటారు.

తుమ్ముని ఆపుకోవడం ,గట్టిగా తుమ్మడం రెండూ ప్రమాదకరమే.తుమ్ముని ఆపుకుంటే మైండ్ లో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.గట్టిగా తుమ్మినట్లయితే ముక్కు ఊడొచ్చే ప్రమాదం ఉంది.

మన చుట్టూ ఎవరైనా ఉన్నప్పుడు నోటికి చేయి అడ్డుపెట్టుకోవడం లేదా కర్చీఫ్ అడ్డుపెట్టుకుని తుమ్మడం చేయాలి.ఇలా చేయడం వల్ల ఇతరులకి ఇబ్బంది కలిగించని వాళ్లమవుతాం. ఎందుకంటే కొంతమందికి నలుగురిలో తుమ్మడం నచ్చదు.

No comments:

Post a Comment