Friday 2 December 2016

దీపావ‌ళి ముందు వ‌చ్చే ధంతేర‌స్ రోజు బంగారమే కాదు ఈ వ‌స్తువులు కొన్నా శుభాలు క‌లుగుతాయ్

దీపావ‌ళి వ‌స్తుంద‌న‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది ట‌పాసులు. పండుగ వారం ఉంద‌న‌గానే ఎవ‌రి ఇంట్లోనైనా ఈ సంద‌డే ఉంటుంది. ఇక పిల్ల‌లు ఉంటే వారు ట‌పాకాయలు కొనే దాకా పోరు పెడుతూనే ఉంటారు. పిల్ల‌లే కాదు, పెద్ద‌ల‌కు కూడా దీపావ‌ళి ట‌పాసులు కాల్చ‌డ‌మంటే అదో స‌ర‌దా. అయితే దీపావ‌ళి అంటే నిజంగా ట‌పాసులే కాదు, అదో దీపాల పండుగ‌. న‌ర‌కాసురున్ని వ‌ధించినందుకు గాను ప్ర‌జ‌లంతా సంతోషంతో జ‌రుపుకునే వేడుక అది.




 దీంతోపాటు చాలా మంది ఆ రోజున ల‌క్ష్మీ దేవిని కూడా పూజిస్తారు. దీపావ‌ళికి ముందు రోజున వచ్చే ధంతేర‌స్ రోజున అంద‌రూ ల‌క్ష్మీ దేవికి పూజ‌లు చేస్తారు. అయితే ఈ ధంతేర‌స్ ఏటా దీపావ‌ళికి ముందు రోజే వ‌స్తుంది, కానీ ఈ సారి మాత్రం రెండు రోజుల ముందే వ‌స్తోంది. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఈ నెల 28వ తేదీన ధంతేర‌స్ రానుంది. ఈ క్ర‌మంలో ఆ రోజున ల‌క్ష్మీ దేవి పూజ‌తోపాటు ప‌లు వ‌స్తువుల‌ను కూడా కొనాల‌ట‌. దీంతో అలా కొనే వారికి ఇంకా ఎక్కువ శుభాలు క‌లుగుతాయ‌ట‌. ఆ రోజున ఏమేం వ‌స్తువులు కొంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.



వంట‌పాత్ర‌లు…
ఇత్త‌డితో త‌యారు చేసిన వంట పాత్ర‌ల‌ను ధంతేర‌స్ రోజున కొనుగోలు చేసి వాటి ఇంట్లో తూర్పు దిక్కున ఉంచాలి. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది.

చీపురు…
ధంతేర‌స్ రోజున చీపురును కొనాలి. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి ప‌ట్టిన ద‌రిద్రం పోతుంద‌ట‌.

ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు…
ఫ్రిజ్‌, మొబైల్ ఫోన్‌, టీవీ వంటి వ‌స్తువుల‌ను ధంతేర‌స్ రోజున కొనాల‌ట‌. అనంత‌రం వాటిని ఇంట్లో వాయువ్య దిశ‌గా ఉంచాలి. అలా చేస్తే అనుకున్న ప‌నులు జ‌రుగుతాయ‌ట‌.




అకౌంట్స్ బుక్‌…

No comments:

Post a Comment