Friday 2 December 2016

దీపావళి రోజు కుబేరుడని పూజిస్తే అష్టైశ్వర్యాలు పొంది కోటీశ్వర్లు అవ్వడం ఖాయం.!

ఈ విశ్వంలో సంపద ఏదైనా … అది ఏ రూపంలో వున్నా దానికి అధిపతి కుబేరుడే. పద్మ … మహాపద్మ … శంఖ … మకర … కచ్చప … ముకుంద … కుంద … నీల … వర్చస అనే ‘నవ నిధులు’ ఆయన అధీనంలో వుంటాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అర్చావతారమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కూడా తన వివాహానికి అవసరమైన ధనాన్ని ఈయన నుంచే అప్పుగా తీసుకున్నాడు. అలాంటి కుబేరుడి అనుగ్రహం లభిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది?

ఇంతకు కుబేరుడు ఎవరు?
కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఈయన మేరుపర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ నిష్టతో తపమాచరించుకునేవాడు.
అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు, ఋషికన్యలు, రాజర్షికన్యలు తదితరులు విహారం కోసం వచ్చేవారు.
పులస్త్యుడికి వీరివల్ల తరచూ తపోభంగం కలుగుతుండేది. అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దనీ, ఒకవేళ ఎవరైనా వచ్చి, తనని చూసిన యెడల గర్భం దాలుస్తారని శాపం విధిస్తాడు.

ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కూతురు ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి, పులస్త్యుడుని చూడటం తటస్థించింది. వెంటనే గర్భం దాల్చింది. భయాందోళనలతో, ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి, తలవాల్చి నిలుచుంది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది గమనించి ఆమెను పులస్త్యుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెను స్వీకరించాల్సిందిగా కోరాడు. అందుకు ఆయన అంగీకరించాడు. వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు. విశ్రవసుడి కొడుకు కుబేరుడు.

కుమారులైన మణిగ్రీవ – నలకూబరులే కాకుండా, అనేకమంది దేవతలు ఆయనను పూజిస్తుంటారు. ఇంతటి తరగని సంపదను తన అధీనంలో పెట్టుకుని, తనని పూజించిన వారిని మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడని అంటారు. ఈ కారణంగానే చాలామంది ఆయనను ‘దీపావళి’ రోజున పూజిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో …అంకిత భావంతో కుబేరుడి మనసు గెలుచుకుంటే, అనతికాలంలోనే అపర కుబేరుల జాబితాలో చేరిపోవడం ఖాయమని చెప్పొచ్చు.

దీపావళి పర్వదినాన లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసింపదలు వెల్లివిరుస్తాయి. అలాగే అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే దీపావళి నాడు కుబేర వ్రతాన్ని ఆచరించడం ఎంతో మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నరకాసురుని వధించిన దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం.
దీపావళి రోజున లేదా మంగళ, శుక్రవారాల్లో ఓ చెక్క పీఠంపై కుబేర ప్రతిమను లేదా పటాన్ని ఉంచి, పటం ముందు
27,20, 25
22, 24, 26
23, 28, 21
అనే సంఖ్యలతో కూడిన ముగ్గును బియ్యం పిండితో అలంకరించుకోవాలి. 9 నాణేలను తీసుకుని కుబేర ముగ్గుపై గల సంఖ్యలపై ఉంచాలి. పూజకు ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించుకోవచ్చు. కుబేర పూజకు నాణేలు, ఎరుపు పువ్వులు తప్పనిసరిగా ఉండాలి. దీపారాధనకు ముందు కుబేర శ్లోకం లేదా కుబేర మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయని విశ్వాసం.
కుబేర మంత్రం

ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః

Sreem Om Namah Om Hrim Sreem Hrim vittesvaraya klim klim Sreem

No comments:

Post a Comment