Sunday 17 July 2022

ఎండు కొబ్బ‌రి ముక్క‌ను తిన‌డం..dry coconut uses..

 Dry Coconut : రోజూ చిన్న ఎండు కొబ్బ‌రి ముక్క‌ను తిన‌డం


మ‌రిచిపోకండి.. ముఖ్యంగా పురుషులు..!

మ‌నం చేసే వంట‌లు చిక్క‌గా ఉండ‌డానికి అలాగే తీపి ప‌దార్థాల త‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో ఎండుకొబ్బ‌రి కూడా ఒక‌టి. ఎండుకొబ్బ‌రిని మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కొంద‌రు దీనిని నేరుగా కూడా తింటూ ఉంటారు. ఎండుకొబ్బ‌రిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఎండుకొబ్బ‌రిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తోపాటు ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండుకొబ్బ‌రిని  తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.


స్త్రీ, పురుషులిద్ద‌రిలో వ‌చ్చే సంతాన‌లేమి స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో కూడా ఎండుకొబ్బ‌రి ఉప‌యోగ‌ప‌డుతుంది. రోజూ ఒక చిన్న ఎండుకొబ్బ‌రి ముక్క‌ను తిన‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య పెర‌గ‌డంతోపాటు లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. త‌ర‌చూ ఎండుకొబ్బ‌రిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ ల బారిన ప‌డే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయని వైద్య నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

No comments:

Post a Comment