ఆది పరాశక్తి యొక్క రూపాంతరలైన సరస్వతి, లక్ష్మి, పార్వతులతో బ్రహ్మ, విష్ణ్జు, మహేశ్వరులు
శ్రీమద్ దేవీ భాగవత పురాణంలో త్రిమూర్తులకు దేవి యొక్క ఆజ్ఞలు మరియు సూచనలు ఇవ్వబడ్డాయి.
శ్రీమద్ దేవీ భాగవత పురాణంలో త్రిమూర్తులకు దేవి యొక్క ఆజ్ఞలు మరియు సూచనలు ఇవ్వబడ్డాయి.
శక్తి,
తన గురించి - "నేను ఆది పరాశక్తిని. భువనేశ్వరిని. సకల చరాచర సృష్టి నా
స్వంతం. అఖండ సత్యాన్ని. స్త్రీ రూపంలో నేను చలనశీల శక్తిని, పురుష రూపంలో
అచలన శక్తిని. నా యొక్క శక్తితో ఈ సృష్టిని మీ ముగ్గురు పాలిస్తారు. నేను
రూపరహితం. సర్వానికి అతీతం. అన్ని దైవ శక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి. నేను
శాశ్వతమైన, అపరిమిత శక్తిని."
బ్రహ్మతో
- "ఓ బ్రహ్మా! ఈ విశ్వానికి సృష్టికర్త నీవే. జ్ఞానానికి, సంగీతానికి
గుర్తింపబడే నా రూపాంతరము శారదా దేవి (సరస్వతి) నీ భార్య. నీ భార్య తో కలసి
ఈ విశ్వాన్ని సృష్టింపుము."
విష్ణువుతో
- "ఓ నారాయణా! నీవు ఎదురులేని, మరణం లేని ఆత్మవి. నీకు రూపం లేకున్ననూ
రూపాన్ని పొందుతావు. భౌతిక రూపాన్ని పొందే దేవతలందరికీ నీవే అధిపతివి. ఈ
విశ్వాన్ని సంరక్షించే బాధ్యత నీదే. ఈ సృష్టిలో జీవాలని రక్షించటానికి నీవు
వివిధ రూపాంతరాలని చెందుతావు. నీవు బ్రహ్మని సృష్టించావు. బ్రహ్మ ఇతర
దేవదేవతలని సృష్టిస్తాడు. నా యొక్క అంతర్భాగమైన శక్తి అయిన మహాకాళి నీ
యొక్క యోగ నిద్ర నుండి అవతరించినది. నీవే పరమాత్మవి. వెలుగుకి ప్రతిరూపమైన,
నా మరొక రూపాంతరము శ్రీ నీ భార్య. జీవం ఉద్భవించే సమయానికి ఈ విశ్వాన్ని
పరిశీలించే, పరిరక్షించే బాధ్యతలని నిర్వర్తించే విష్ణువు యొక్క రూపాన్ని
నీవు పొందుతావు."
శివునితో
- "ఓ రుద్రా! మూర్తీభవించిన నీ రూపం, కాలగతికి చిహ్నం. నీవు రూపంలో
లేనపుడు కాలం స్థంభిస్తుంది. నా యొక్క శక్తితో నీలో చలనము కలుగుతుంది. ఈ
శక్తి ద్వారానే విశ్వ వినాశనానికి, దాని పునర్నిర్మాణానికి కారకుడవు
అవుతావు. మహాశక్తిని అయిన నేనే నీ భార్యను. లక్ష్మీ సరస్వతులు కేవలం నాలోని
భాగాలు. నా రూపాంతరాలు. నా పరిపూర్ణ రూపం మహా శక్తి. నీ ధ్యాన శక్తి వలన
నా యొక్క అన్ని రూపాంతరాలని నీవు మించిపోతావు. అప్పుడే నేను నీ ఎడమ భాగం
నుండి నేను అవతరిస్తాను.
No comments:
Post a Comment