ఏలియన్లు
నిజంగా ఉన్నారా? లేరా? ఉన్నారని కొందరంటే, అదంతా అభూతకల్పన అని
కొట్టిపడేసేవారు వారు మరికొందరు. ఏలియన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా విస్తృత
పరిశోధనలు జరుగుతున్నాయి. ఎగిరే పళ్లాలు(ఫ్లయింగ్ సాసర్స్)లో వచ్చిన
ఏలియన్స్‌ను చూశామని చెప్పేవారు ఎందరో. అప్పుడప్పుడు గగనతలంపై ప్రయాణించే
గుర్తుతెలియని వస్తువులు ఫ్లయింగ్ సాసర్లేననేది నొక్కి చెప్పేవారూ ఉన్నారు.
అయితే శాస్త్రీయంగా ఈ విషయం ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు.

అయితే తాజాగా చంద్రుడి ఉపరితలంపై ఏలియన్స్‌ను గుర్తించినట్టు యూఎఫ్ఓ హంటర్స్ ప్రకటించారు. చంద్రుడి భూమిపై ‘లూనార్ బేస్’ను గుర్తించామని, మనుషుల్లాంటి జీవులను కూడా తాము కనుగొన్నామని చెబుతున్నారు. ‘ఎం’ ఆకారంలో కనిపిస్తున్న నిర్మాణాలు తెలివైన ఏలియన్లకు గుర్తు అని నాసా ఫొటోల్లో ఏలియన్స్ ఉనికిని గుర్తిస్తున్న యూఎఫ్ఓ థియరిస్ట్ స్కాట్ సి.వారింగ్ తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై కనిపిస్తున్న ‘బిల్డింగ్’లో ఏలియన్ టెక్నాలజీ కనిపిస్తోందన్నారు.
దీనిని బట్టి చూస్తే అవసరమైతే దానిని అంతరిక్ష నౌకలానూ ఉపయోగించే వీలున్నట్టు కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం చంద్రుడిపై కనిపించిన నిర్మాణం ఏలియన్స్ ఉన్నారనడానికి గొప్ప ఉదాహరణ అని యూఎఫ్ఓ సైటింగ్స్ డైలీలో వారింగ్ రాశారు. చంద్రుడిపై కనిపించిన నిర్మాణం మనుషులు నిర్మించినట్టుగానే ఉందని పేర్కొన్న వారింగ్, గ్రహాంతర జీవులు కూడా మనలాగే ఉండొచ్చనడానికి ఇది ఉదాహరణ అని వివరించారు. దానిని నిర్మించిన వారు తప్ప వేరొకరు అందులో ప్రవేశించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

No comments:
Post a Comment