Friday, 2 December 2016

బొప్పాయ మనకు చేసే మేలు ఏమిటంటే.??

బొప్పాయి పండును మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఆరోగ్యపరంగా ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ పండు అందరికీ ఎంతో మంచిది అయినప్పటికీ గర్భవతులు ఈ పండును తినకుండా ఉండటమే ఎంతో మంచిది.
ఆరోగ్యపరంగా బొప్పాయి మనకు ఎంతగా మేలు చేస్తుందంటే……..
బొప్పాయి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ ఎ, సి, ఇ లు కలిగివుండే బొప్పాయిని తీసుకోవడం ద్వారా ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.




• శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలంటే రోజూ పరగడుపున ఒక కప్పు బొప్పాయిని తీసుకోవడం మంచిది.
• బొప్పాయిలో పీచు పదార్థాలెక్కువ. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. శరీరానికి ఎనర్జీనిస్తుంది.
• చర్మ వ్యాధులను నయం చేస్తుంది. చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. చర్మం ప్రకాశవంతమవుతుంది.


• కంటికి మేలు చేస్తుంది. దృష్టిలోపాలను నయం చేయడంలో బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుంది.
• గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంతో పాటు క్యాన్సర్‌ను నిరోధిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

No comments:

Post a Comment