ఒకప్పుడంటే ఫోన్లలో పదులు, వందల సంఖ్యలో కాంటాక్ట్ నంబర్లను
మాత్రమే సేవ్ చేసుకునేందుకు వీలుండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆండ్రాయిడ్
ఫోన్ల రాకతో ఆ పరిమితి కాస్తా మారి, అపరిమితమైన సంఖ్యలో ఫోన్
నంబర్లను సేవ్ చేసుకునే వీలు కలిగింది. అయితే ఎన్ని నంబర్లు సేవ్
చేసుకున్నా వాటిని సరైన పేరుతోనే సేవ్ చేయాల్సిందే. లేదంటే ఇబ్బందులు
తప్పవు.
ఒకరికి ఫోన్ చేయబోయి మరొకరికి చేయాల్సి వస్తుంది. ఇదంతా ఫోన్‌లో కాంటాక్ట్ నంబర్లు ఉంటే, మరి అవే నంబర్లు లేకపోతే…? అప్పుడు ఏదైనా ఫోన్ నంబర్ ఎవరిదో తెలుసుకోవడం చాలా కష్టతరమవుతుంది. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటే ఆ బెంగ లేదు. ఎందుకంటే ఈ యాప్‌ను డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. దాంతో యూజర్లు తమ డివైస్‌లో లేని ఫోన్ నంబర్లు ఎవరివో, వారి పేరేమిటో కూడా సింపుల్‌గా తెలుసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్లను వాడుతున్న వారి కోసం ట్రూ డయలర్ – ఫోన్ అండ్ కాంటాక్ట్స్ (Truedialer – Phone & Contacts) పేరిట ఓ యాప్ అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ ఉన్న ఫోన్లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. ట్రూ డయలర్ యాప్ ద్వారా యూజర్లు తమ ఫోన్‌లో లేని నంబర్ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. సదరు ఫోన్ నంబర్ ఎవరిదో వారును కనుక్కోవచ్చు. అందుకు ఏం చేయాలంటే…
ట్రూ డయలర్ ఓపెన్ చేస్తే అందులోనూ ఫోన్ డయలర్ మాదిరిగానే స్క్రీన్ వస్తుంది. అందులో యూజర్లు ఏదైనా ఫోన్ నంబర్‌ను టైప్ చేస్తూ వెళ్తుంటే దానికి సంబంధించిన వివరాలు పైన స్క్రీన్‌లో కనిపిస్తాయి. ఫోన నంబర్ పూర్తిగా ఎంటర్ చేయగానే ఆ నంబర్ ఎవరిదో వారి పేరును కూడా స్క్రీన్‌పై చూపుతుంది ఈ యాప్. దీంతోపాటు డివైస్ కాల్ హిస్టరీలో ఉన్న తెలియని ఫోన్ నంబర్లు ఎవరివో కూడా సింపుల్‌గా తెలుసుకోవచ్చు. ట్రూ కాలర్ డేటాబేస్‌లో 200 కోట్లకు పైగా నంబర్లు ఫీడ్ అయి ఉన్నాయి. కనుక దాదాపుగా ఎవరి ఫోన్ నంబర్‌నైనా ఇట్టే తెలుసుకోవడం సాధ్యమవుతుంది. అనేక రకాల స్మార్ట్‌ఫోన్లకు ఈ యాప్ సపోర్ట్‌ను కూడా ఇస్తుంది.

No comments:
Post a Comment